Posts

స్వామి వివేకానంద సూక్తులు - 112

(ప్రస్తుతం) మనకు కావలసినది 'శ్రద్ధ  '.  దురదృష్టవశాత్తు, అది ( శ్రద్ధ ) భారతదేశం నుంచీ దాదాపు అదృశ్యమైంది.  అందుకే మనము ఈ ప్రస్తుతస్థితిలో ఉన్నాము. ― స్వామి వివేకానంద. What we want is this Shraddha .  Unfortunately, it has nearly vanished from India, and this is why we are in our present state.    ― Swami Vivekananda.

స్వామి చిన్మయానంద సూక్తులు - 203

మనసు మరియు బుద్ధి ఉన్నతస్థితిని చేరిన క్షణాన మనము మనలోని సత్యస్వరూపుడైన భగవంతుని ప్రత్యక్షంగా చూడవచ్చు. ― స్వామి చిన్మయానంద. The moment the mind and intellect are transcended, we are face to face with Truth or the Self in us.          ― Swami Chinmayananda.

స్వామి వివేకానంద సూక్తులు - 111

మరణము నిశ్చయమైనది కావున ఒక మంచి కార్యం చేస్తూ మరణించటం మేలు. ― స్వామి వివేకానంద. When death is so certain, it is better to die for a good cause    ― Swami Vivekananda.

స్వామి చిన్మయానంద సూక్తులు - 202

శ్రద్ధగా చదువు.  నిలకడగా ఉండు. నీ లక్ష్యాలను ఉన్నతంగా ఉంచుకొని భావోద్వేగమును విడిచి  కష్టపడి పనిచేయి. ― స్వామి చిన్మయానంద. Read well. Be steady. Keep your goal high and work hard without any excitement.          ― Swami Chinmayananda.

స్వామి వివేకానంద సూక్తులు - 110.

గ్రామగ్రామానికి వెళ్ళి మానవాళికి మంచి చేసి దానిని ప్రపంచానికి విస్తరించు. ఇతరుల ముక్తికై నరకానికి వెళ్ళటానికైనా వెనుకాడకు. ― స్వామి వివేకానంద. Go from village to village, do good to humanity and to the world at large. Go to hell yourself to buy salvation for others.    ― Swami Vivekananda.

స్వామి చిన్మయానంద సూక్తులు - 201.

నీ జీవితంలోని ప్రతి క్షణాన్నీ వినియోగించుకో. పరమాత్ముని లీలలు తప్ప వేరొకటి మాట్లాడకు; (వాటిని) అధ్యయనం చేసి ఒంటరిగా ఉన్నపుడు వాటిగురించి ఆలోచించు. నీ అంతరంగాన్ని పరమానందస్థితిలో ఉంచుకో. ― స్వామి చిన్మయానంద. Make use of every moment of your life. Talk nothing but His Glories, study and reflect when alone. Fill yourself up with the Joy-State of the Higher Self.          ― Swami Chinmayananda.

స్వామి వివేకానంద సూక్తులు - 109.

మనలను (స్వతంత్రంగా) మన కాళ్ళపై నిలబడేటట్లుగా ఏదైతే తీర్చిదిద్దుతుందో అదే నిజమైన విద్యాభ్యాసము. ― స్వామి వివేకానంద. Real education is that which enables one to stand on one's own legs.    ― Swami Vivekananda.